అభివృద్ధి చేసే నాయకుడికి పట్టం కట్టాలి
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయమని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రజలను కోరారు. శనివారం వర్ధన్నపేట పట్టణంతోపాటు మున్సిపాలిటీ విలీన తండాల్లో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రాకేశ్‌రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం, సభలు నిర్వహించారు.
- బీఆర్ఎస్ పాలనలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
- డబ్బులు పెట్టి టికెట్ కొన్న వ్యక్తి ప్రజలకు సేవ చేస్తడా..
- మీ బిడ్డగా ఆశీర్వదించండి
- వర్ధన్నపేట అభ్యర్థి, ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట, నవంబర్ 25: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయమని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రజలను కోరారు. శనివారం వర్ధన్నపేట పట్టణంతోపాటు మున్సిపాలిటీ విలీన తండాల్లో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రాకేశ్‌రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం, సభలు నిర్వహించారు. ప్రజలు మహిళలు మంగళహారతులు, బతుకమ్మలు, బోనాలతో స్వాగతించి బొట్టుపెట్టి అధిక మెజార్టీతో గెలుపొందాలని దీవెనలు అందించారు. కళాకారుల ఆటపాటలు, డప్పు చప్పుళ్లతో తండాలు, వర్ధన్నపేట పట్టణంలో సందడి నెలకొన్నది. అరూరి మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని, దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ చేతిలోకి పోతే మరోసారి తెలంగాణ ఇబ్బందుల్లో పడుతుందని తెలిపారు. ప్రజలు ఆలోచించి ఈనెల 30 జరిగే ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ సహకారంతో పదేండ్లలో నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు రూ.2,700కోట్లతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. పదేళ్ల క్రితం నియోజకవర్గంలో అంతర్గత రోడ్లు, తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు.
కాగా, బీఆర్ఎస్ పాలనలో వర్ధన్నపేట పట్టణ రూపురేఖలు మారాయన్నారు. గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో గ్రామ పంచాయతీగా ఉన్న వర్ధన్నపేటను మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసినట్లు పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి రూ.164కోట్ల నిధులను తీసుకువచ్చి ఏవిధంగా అభివృద్ధి చేశామో ప్రజలు చూస్తున్నారని అన్నారు. అంబేద్కర్ సెంటర్, జాతీయ రహదారి వైడెనింగ్ చేయడంతో పట్టణానికి కొత్తరూపు వచ్చిందన్నారు. త్వరలోనే మార్కెట్ అందుబాటులోకి రానుండడంతోపాటు అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. మరోసారి తనకు అవకాశం కల్పిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడంతోపాటుగా ప్రజలకు మరిన్ని మెరుగైన వసతులు కల్పిస్తానని కోరారు. రైతు సమితి జిల్లా కన్వీనర్ లలితాయాదవ్, ఏనుగుల రాకేష్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అరుణ, వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విలీన గ్రామాలను అభివృద్ధి చేశా
హసన్‌పర్తి: అభివృద్ధి చేసే నాయకుడికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 65, 66 డివిజన్లలోని హసన్‌పర్తి, ఎల్లాపూర్, చింతగట్టు, మునిపల్లి, దేవన్నపేట, నిరూప్‌నగర్ తండా, మధుతండా, ఆహాల్యతండా, సుబ్బయ్యపల్లిలో శనివారం ఇంటింటా ప్రచారం చేశారు. మహిళలు పార్టీ శ్రేణులు కోలాటాలు, డప్పు చప్పుళ్లు, బతుకమ్మలు, మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తెలంగాణకు కరెంట్ మూడు గంటలే వస్తుందన్నారు. మూడోసారి సీఎం కేసీఆర్‌ను గెలిపిస్తే రైతులకు ఉచితంగా 24గంటలు కరెంటు, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. తనను మూడోసారి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రేటర్ 65, 66 డివిజన్లకు అధిక మొత్తంలో నిధులు వెచ్చించి విలీన గ్రామాలను సిటీలా అభివృద్ధి చేశానని పేర్కొన్నారు.
ప్రజలను చిత్రహింసలు పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ కొనుక్కొని ప్రజలకు సేవ చేస్తానని వస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ లలితాయాదవ్, రాష్ట్ర నాయకుడు కార్పొరేటర్ గుగులోత్ దివ్యరాణీ రాజునాయక్, వైస్ ఎంపీపీ బండా రత్నాకర్‌రెడ్డి, జడ్పీటీసీ సునీత, ఆత్మ చైర్మన్ చంద్రమోహన్, డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, పార్టీ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, పాక్స్ వైస్ చైర్మన్ పాడి మల్లారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సుభాశ్‌గౌడ్, ఆత్మ డైరెక్టర్ భూపాల్‌గౌడ్, మ్యాదెర దేవేంద్ర, డివిజన్ ప్రధాన కార్యదర్శి పుట్ట శంకర్, గ్రామ అధ్యక్షులు పోలెపెల్లి రాజు మైకెల్, దోమల శ్రీనివాస్, నద్దునూరి కరుణాకర్, నునావత్ జైపాల్, మార్కెట్ డైరెక్టర్ వీసం సురేందర్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, పిట్టల కుమారస్వామి, పోలెపెల్లి మల్లేశం, రఘోత్తంరెడ్డి, నద్దునూరి నాగరాజు, జేకే జయాకర్, యుగేందర్, శ్రావణ్, దామెర సాగర్, రాముచారి, విక్రమ్ సమ్ములు, ఎల్లమ్మ, శ్రీధర్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

