కరీమాబాద్, జూలై 30 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి అమలు, సంక్షేమ పథకాలను చూసి చాలా మంది బీఆర్ఎస్లోకి చేరుతున్నారని అన్నారు. శనివారం శంభునిపేటలో కార్పొరేటర్ పోశాల పద్మ ఆధ్వర్యంలో పలు పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. విచ్ఛిన్నకర శక్తులను ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో టీఆర్ఎస్కు ఎదురులేదన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారన్నారు. పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి అండగా ఉంటామన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీలోని కొత్త.. పాత తేడా లేకుండా నాయకులు కలసికట్టుగా ముందుకు సాగాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మంత్రి కేటీఆర్ అండదండలతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేపడతామన్నారు. బీఆర్ఎస్లోనే సామాన్యులకు సైతం అవకాశాలు వస్తాయన్నారు.
పార్టీ బలోపేతానికి అందరం పని చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలను ఎండగట్టాలన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న పనులను క్షేత్రస్థాయిలో వివరించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
కేసీఆర్‌తోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, గురుకులాలతో నాణ్యమైన విద్య, దళిత బంధు, బీసీలకు రూ.లక్ష పథకం ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు దేశంలో ఎక్కడా లేరన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్ పోశాల పద్మ, కుడా సలహా మండలి సభ్యుడు మోడెం ప్రవీణ్, డివిజన్ అధ్యక్షుడు ఈదుల రమేశ్, నాయకులు పోశాల స్వామి, బజ్జూరి రవి, కలకోట్ల రమేశ్, ఈదుల భిక్షపతి, మండల సురేశ్, కర్నె రవీందర్, హైమద్‌ఖాన్, కోట గిరి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.