వరంగల్ ఫిబ్రవరి 3 : మున్సిపోల్స్‌లో బిగ్ ఫైట్ కనిపిస్తోంది. మంగళవారం ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లోని 260 వార్డులకు 1072 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అన్ని పార్టీలు నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించి బీఫాంలను అందజేశాయి. టిక్కెట్లు దక్కని వారిని ఆయా పార్టీ నాయకులు బుజ్జగింపులు చేసి ఉపసంహరించుకునేలా చేశారు. కొన్ని చోట్ల వివిధ పార్టీల నుంచి నామినేషన్లు వేసిన అభ్యర్థులు రెబల్స్‌గా బరిలో నిలిచారు. 12 మున్సిపాలిటీలోని 260 వార్డులకు 2,372 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 300 నామినేషన్లు స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యాయి. ఉపసంహరణ నాటికి 2,072 మంది అభ్యర్థుల నామినేషన్లు మిగులగా, అనంతరం 1072 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు.
కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెబ ల్స్ బెడద ఎక్కువగా ఉంది. నామినేషన్ల ఉపసంహరణ చివరి నిమిషం వరకు ఆ పార్టీ నాయకులు బుజ్జగింపుల పర్వం కొనసాగించారు. ముఖ్య నేతలు బుజ్జగించినా చాలా వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన నేతలు ఉపసంహరించుకునేందుకు ససేమిరా అన్నారు. దీంతో మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, స్టేషన్‌ఘన్‌పూర్, నర్సంపేట లాంటి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఒక్కో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి రెబల్స్ అభ్యర్థులుగా ఇద్దరికి మించి బరిలో ఉన్నారు.
బీజేపీకి అభ్యర్థులు లేరు..
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారు. చాలా వార్డుల్లో ఆ పార్టీ నుంచి నా మినేషన్లు రాలేదు. మహబూబాబాద్, జనగా మ, భూపాలపల్లి, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్, తొర్రూరు, డోర్నకల్ మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ను పూర్తిగా నిలుపలేకపోయింది. ఎక్కువ వార్డు ల్లో నామమాత్రంగా బరిలో నిలిపింది. కేంద్రం లో అధికార పార్టీ అయినా ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లోని 260 వార్డుల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడం గమనార్హం.260 వార్డుల్లో 1072 మంది పోటీఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లోని 260 వార్డుల్లో 1072 మంది అభ్యర్థులు పోటీ లో నిలిచారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అన్ని వార్డుల్లో పోటీ చేస్తుండగా కొన్నింట్లో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని బరిలో నిలిచాయి. స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా పోటీ చేస్తున్నారు. ఉపసంహరణ ముగిసిన తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించారు.