ఖిలా వరంగల్, ఏప్రిల్ 08 : యువతకు చేయూత నిచ్చే రాజీవ్ యువ వికాసం పథకంలో గందరగోళం నెలకొందిని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్వీర్ అన్నారు. మంగళవారం వరంగల్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణిని కలిసి రాజీవ్ యువ వికాసం పథకంపై సమగ్రంగా సమీక్షించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి గవర్నమెంట్ కార్పొరేషన్ రుణాలు అందే విధంగా చూడాలనన్నారు. అన్ని బ్యాంకుల నుంచి మద్దతు పొందేందుకు బ్యాంక్ మేనేజర్లు, ఎల్డీఎంలతో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులకు మేలు చేయాలన్నారు.
యువతకు దీనిపైన అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వరంగల్లో క్రైమ్ రేట్ చాలా పెరిగిందని, మత్తు పానీయాలకు యువత అలవాటు పడిపోయి వివిధ నేరాలలో అనవసరంగా ఇరుక్కుని తమ జీవితాలు ఆగం చేసుకుంటున్నరన్నారు. అపోహలు సృష్టితున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట కార్యవర్గ సభ్యులు ఆనగందుల శ్రవణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాపాక ప్రశాంత్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాళ్లబండ మున్న, డివిజన్ అధ్యక్షులు ఉప్పుల వినయ్, పెందోట మహంత్ తదితరులు పాల్గొన్నారు.