భద్రకాళీ శాకంబరీ నవరాత్రోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. మూడో రోజు సోమవారం ఉదయం అమ్మవారు కుల్లా క్రమంలో, సాయంత్రం నిత్యక్లిన్నా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకుడు భద్రకాళీ శేషు అమ్మవారికి ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, క్షీరాన్నం నివేదించారు.

మంగపేట, జూలై 8 : మంగపేట మండలంలోని కొత్తూరుమొట్లగూడెం, తిమ్మాపురం, దోమెడ, తక్కళ్లగూడెం తదితర గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో కప్పవాగు, ముసలమ్మవాగు, గౌరారం, కమలాపురం ఎర్రవాగుల్లో వరద పెరిగింది. తక్కళ్లగూడెం వద్ద వరద ప్రవాహం రోడ్డుపైకొచ్చింది. కొత్తూరుమొట్లగూడెం-బొమ్మాయిగూడెం నడుమ గౌరారం వాగు రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహించడంతో రోజంతా రాకపోకలు నిలిచిపోయాయి. వరద పెరగడంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసరం ఉంటే అధికారుల సహాయం పొందాలని పంచాయతీ సిబ్బంది గ్రామస్తులకు సూచనలు చేశారు.