వరంగల్, జూలై 14: భద్రకాళీ శాకంబరీ నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు ఆదివారం కాళీ క్రమాన్ని అనుసరించి అమ్మవారిని ఉగ్రప్రభా మాతగా అలం కరించారు.
ఉదయం నిత్యాహ్నికం పూర్తి చేసి, ఉగ్రప్రభా మాత, సాయంత్రం త్వరితా మాతగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.