దుగ్గొండి, మే 7: గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా రోడ్లు నిర్మిస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిలోని గిర్నిబావిలో జరుగుతున్న బీటీరోడ్డు నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించి యుద్ధప్రాదిపతికన పనులు చేయిస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాని సూచించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని, అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు నిత్యం పనులను పర్యవేక్షించాలని కోరారు. వర్క్ షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, చలపర్తి సర్పంచ్ ముదరుకోళ్ల శారదాకృష్ణ, కంచరకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉన్నారు.
వధూవరులకు ఎమ్మెల్యే పెద్ది ఆశీర్వాదం
దుగ్గొండి/నర్సంపేటరూరల్: దుగ్గొండి మండలం చలపర్తికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు నల్ల కమలాకర్‌రెడ్డి-రామ దంపతుల కుమార్తె రవళికరెడ్డి-అరవింద్‌రెడ్డి వివాహం ఆదివారం జరిగింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, దుగ్గొండి ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, బీఆర్ఎస్ మండవల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, చలపర్తి సర్పంచ్ ముదరుకోళ్ల శారదాకృష్ణ, కంచరకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే, నర్సంపేట మండలం ఏనుగల్తండాకు చెందిన స్రవంతి-బాలాజీ వివాహం జరిగింది. ఎమ్మెల్యే పెద్ది హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ స్వాతి, బీఆర్ఎస్ నాయకులు రమేశ్, రాజు, తిరుపతి, వెంకన్న, ఈర్య, ధంజ్యా, మొగిలి, వీరన్న, లక్పతి పాల్గొన్నారు. తర్వాత లక్నేపల్లిలోని నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
బాధితులకు ఎమ్మెల్యే పెద్ది పరామర్శ
దుగ్గొండి/నర్సంపేటరూరల్: వివిధ కారణాలతో అనారోగ్యానికి గురైన పలువురిని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. దుగ్గొండి మండలంలోని తిమ్మంపేటకు చెందిన గంగాడి చంద్రారెడ్డి, కోమాండ్ల రమణారెడ్డి ప్రమాదానికి గురి కాగా, వారిని పరామర్శించారు. అనంతరం ఇదే గ్రామానికి చెందిన గొల్లెన పెద్ద బక్కయ్య అనారోగ్యంతో మృతి చెందగా, అతడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, నాయకులు ఎం కృష్ణ, మోడెం విద్యాసాగర్గ్రౌడ్, దోనపాటి జనార్దన్‌రెడ్డి, మచ్చిక కిరణ్ తదితరులు ఉన్నారు. అంతేకాకుడా నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న సీఆర్పీ మర్ధ శ్రీనును ఎమ్మెల్యే పెద్ది పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ గొడిశాల రాంబాబుగౌడ్, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, మాజీ ఎంపీటీసీ పరాచికపు శ్యామ్‌సుందర్, ఉప సర్పరాచికపు సంతోష్, ఉల్లేరావు రాజు, పాత్కాల కొమ్మాలు, రమేశ్ పాల్గొన్నారు.
మృతుల కుటుంబానికి..
చెన్నారావుపేట: మండలకేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పల్లకొండ మల్లయ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ముందుగా మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే, మండలంలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన నాంపెల్లి లక్ష్మి ఇటీవల మృతి చెందగా, ఆమె కుటుంబాన్ని జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, మండల నాయకుడు బుర్రి తిరుపతి, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, మాజీ ఎంపీపీ జక్క అశోక్, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, ఖాదర్‌పేట సర్పంచ్ అనుముల కుమారస్వామి, యువ నాయకులు కంది కృష్ణచైతన్య, కే సాయిలు పాల్గొన్నారు.