Cyber Crimes | మొగుళ్ళపల్లి, జూన్ 25 : సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అప్పుడే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉంటామని ఏఎస్ఐ రాజేశం రైతులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలో రైతులకు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ.. తెలియని ఫోన్ కాల్స్, ఓటిపీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ అరెస్టు అంటూ నేరగాళ్లు కొత్త రకం మోసాలకు పాల్పడుతూ న్నారని, ఇటువంటి మోసాలును గ్రహించాలని, డిజిటల్ అరెస్టు అనేది ఉండదని ఇటువంటి చర్యలకు పాల్పడితే పోలీస్ లేదా టోల్ ఫ్రీ నెం 1930కి పిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.