మహబూబాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రైల్వేకు సంబంధించిన పీరియాడికల్ ఓవరాలింగ్ పీవోహెచ్), రొటీన్ ఓవరాలింగ్ (ఆర్వోహెచ్) రైల్వే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లాకు కేటాయించగా, ఇకడి నుంచి వరంగల్‌కు తరలించేందుకు అక్కడి ఎంపీ కడి యం కావ్య కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు ఆరోపించారు. సోమవారం మహబూబాబాద్‌లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన రూ.908.15 కోట్లు నిధులు కూడా మంజూరయ్యాయని, మహబూబాబాద్ పట్టణంలో 300 ఎకరాల భూమిని కేంద్రానికి అప్ప గిస్తే ఈ ప్రాజెక్టు పనులు మొదలవుతాయన్నారు.
మహబూబాబాద్-ఇంటికన్నె మధ్య నెల కొల్పేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ సమయంలో ఇటీవల రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించిన ఎంపీ కడియం కావ్య ఈ రైల్వే ప్రాజెక్టును కాజీపేట-నషల్ మధ్య ఏర్పాటు చేసేందుకు చర్చలు జరిపినట్లు పత్రికల్లో చూశానన్నారు. మానుకోట జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇక డ గిరిజనుల కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు తెచ్చారని, కలెక్టరేట్, ఎస్పీ కార్యాల యం, మెడికల్, నర్సింగ్ కాలేజ్, హార్టికల్చర్, ఇంజినీరింగ్ కాలేజ్ ఇలా రకరకాలుగా అభివృద్ధి చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన జిల్లాకు వచ్చిన రైల్వే ప్రాజెక్టును వరంగల్‌కు తరలించడం దారుణం అన్నారు.
రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో బయ్యారం ఉకు పరిశ్రమ ఇప్పటికీ నెలకొల్ప లేదన్నారు. వచ్చిన రైల్వే ప్రాజెక్టును వరంగల్‌కు తరలిస్తే ఇకడున్న గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ విషయంలో జిల్లాకు చెందిన ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్‌తో పాటు మంత్రి సీతక దద్దమ్మల్లాగా చూస్తూ కూర్చుని ఉన్నారని విమర్శించారు. గతంలో కాజీపేటలో ఎలక్ట్రికల్ లోకోమోటివ్ పీహెచ్‌వో ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుని 120 ఎకరాల భూమి కావాలని కోరితే ల్యాండ్ లేక ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదన్నారు. 120 ఎకరాలు చూడలేని వారు 300 ఎకరాల భూమి ఎకడి నుంచి సేకరిస్తారని ప్రశ్నించారు.
మానుకోటకు వచ్చిన రైల్వే ఫ్యాక్టరీని ఇతర ప్రాంతానికి తరలిస్తే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కలెక్టర్‌కు చెప్పి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భూమిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. మానుకోటలో వందల ఎకరాల భూమి కబ్జాకు గురవుతున్నా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేన్నారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్లలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ అన్నారు. ఇప్పటికైనా రిజర్వేషన్లను రద్దుచేసి కొత్తగా చేసి బీసీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో మానుకోట మున్సిపల్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, జేరిపోతుల వెంకన్న, మంగ ళంపల్లి కన్న, కొండపల్లి కరుణాకర్ రెడ్డి, బానోత్ రవికుమార్ పాల్గొన్నారు.