ఖిలావరంగల్: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం శనివారం నాటి రాష్ట్ర బందును (BC Bandh) జయప్రదం చేయాలని బీసీ రిజర్వేషన్ల సాధన కమిటీ నాయకుడు, సామాజికవేత్త మేరుగు అశోక్ పిలుపు నిచ్చారు. శుక్రవారం శివనగర్‌లోని తన కార్యాలయంలో బందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42 శాతం బీసీల రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన రాష్ట్ర బంద్‌లో యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఇప్పటికైనా బీసీలు ఐక్యతతో ముందుకు సాగితేనే తమ హక్కులను న్యాయమైన డిమాండ్లను సాధించుకోవచ్చు అన్నారు.
ఈ బంద్‌కు వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి సహకరించాలని కోరారు. ప్రతి బీసీ బిడ్డ బందుకు సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం 35 డివిజన్ అధ్యక్షులు గడ్డం రవి, నాయకులు వెంగల్ దాస్ రాజేంద్రప్రసాద్, అంకతి అఖిల్, చీదురాల సాయి రామ్, గడ్డం సాయి దీక్షిత్, ఘటికే రామచందర్, పోకల రోషన్ తదితరులు పాల్గొన్నారు.