బీసీ బాలికల హాస్టల్ ఎత్తేశారు..
శాయంపేటలో సొంత భవనంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగిన బీసీ బాలికల హాస్టల్‌ను ఎత్తేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా అడ్మిషన్లు తీసుకోకుండా, కళాశాల హాస్టల్‌గా అప్‌గ్రేడ్ చేసి హనుమకొండకు తరలించారు. దీంతో స్థానిక నిరుపేద విద్యార్థినులు నష్టపోతున్నారు. ఇన్నాళ్లు నాలుగో తరగతి నుంచి పదో తరగతి బాలికలకు వసతి కల్పించారు.
- కళాశాల హాస్టల్‌గా అప్‌గ్రేడ్.. హనుమకొండకు తరలింపు
శాయంపేట, జూన్ 25 : శాయంపేటలో సొంత భవనంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగిన బీసీ బాలికల హాస్టల్‌ను ఎత్తేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా అడ్మిషన్లు తీసుకోకుండా, కళాశాల హాస్టల్‌గా అప్‌గ్రేడ్ చేసి హనుమకొండకు తరలించారు. దీంతో స్థానిక నిరుపేద విద్యార్థినులు నష్టపోతున్నారు. ఇన్నాళ్లు నాలుగో తరగతి నుంచి పదో తరగతి బాలికలకు వసతి కల్పించారు. ఇక్కడి వార్డెన్‌కు ఇటీవల బదిలీల్లో మహబూబాబాద్‌కు బదిలీ కాగా, మరో వార్డెన్ విధుల్లో చేరారు.
గతేడాది శాయంపేటలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 30 మంది బాలికలకు ఇక్కడ వసతి కల్పించారు. స్కూల్ పిల్లలు హాస్టల్‌కు రావడం లేదని కాలేజీ హాస్టల్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు కమిషనరేట్ నుంచి ఆదేశాలు వచ్చాయని వార్డెన్ రజిత తెలిపారు. హనుమకొండలో బిల్డింగ్ చూస్తున్నారని, దొరకగానే ఇక్కడి నుంచి తరలిస్తామని, అక్కడ ఇంటర్ నుంచి పీజీ వరకు బీసీ బాలికల హాస్టల్ కొనసాగుతుందని వివరించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

