తెలంగాణ ఆడబిడ్డలు గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ. పేద మహిళలు కూడా ఈ పండుగను ఆత్మగౌరవంతో సంతోషంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉచితంగా చీరెలను అందిస్తున్నది. ఈ దఫా 27 రంగులు, 25 డిజైన్లతో చూడ ముచ్చటగా, మరింత మన్నికతో నేసిన చీరెలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డుల్లో వీటిని భద్రపరిచారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 2,87,027 మంది లబ్ధిదారులు ఉండగా, సర్కారు నుంచి ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తామని డీఆర్డీఏ అధికారులు తెలిపారు.
– హనుమకొండ, అక్టోబర్ 2
హనుమకొండ, అక్టోబర్ 2: జిల్లాలోని ఆడబిడ్డలకు తీపి కబురు అందించింది తెలంగాణ సర్కారు. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా సర్కారు కానుకను అందించనున్నది. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు చీరెలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. 27 రంగు లు.. 25 డిజైన్ల చీరెలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి.
పండుగ పూట ప్రతి మహిళ మొహంలో సంతోషం వెల్లివిరిసేలా చీరెలను సిద్ధం చేసింది. హైదరాబాద్ టెస్కో నుంచి వచ్చిన చీరెలను వరంగల్ ఎనుమాము ల మార్కెట్ యార్డులో భద్రపరిచారు. కాగా, సివిల్ స ప్లయ్ అధికారుల వివరాల ప్రకారం హనుమకొండ జిల్లాలో 2,87,027 మంది ఆడబిడ్డలు(లబ్ధిదారులు) ఉన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకకు ముందుగానే వీరందరికీ సర్కారు సారె అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. 18 సంవత్సరాలు నిండిన యువ తులు, మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీకి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.
ఆకర్షణీయంగా చీరెలు..
గతంలో పంపిణీ చేసిన చీరెల గురించి మహిళల నుంచి అధికారులు అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి పంపించారు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ సారి మరింత ఆకర్షణీయంగా చీరెలను తయారు చేశా రు. మరింత మన్నికతో 27 సరికొత్త రంగులు.. 25 డిజైన్లతో రూపొందించారు. పెద్ద పెద్ద బార్డర్లు, జరీ అంచులతో ఆకర్షణీయంగా నేయించినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 2,87,027 మందికి పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,86,000 చీరెలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయని, మిగిలినవి త్వరలో రానున్నాయని డీఆర్డీఏ అధికారు లు తెలిపారు.
మండలాల వారీగా లబ్ధిదారులు..
బతుకమ్మ పండుగ నేపథ్యంలో హనుమకొండ జిల్లాలోని ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేసేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆత్మకూరు మండలానికి 13,563, భీమదేవరపల్లికి 15,129, దామెరకు 10,924, ధర్మసాగర్‌కు 18, 406, ఎల్కతుర్తికి 13,630, హసన్పర్తికి 11,246, ఐనవోలుకు 16,944, కమలాపూర్‌కు 20,791, నడికూడకు 13,265, పరకాలకు 7,139, శాయంపేటకు 16,329, వేలేరుకు 9,552 చీరెలను కేటాయించారు. అదేవిధంగా గ్రేటర్ పరిధిలోని ధర్మసాగర్ మండలానికి 1,253, హనుమకొండకు 52,053, హసన్పర్తికి 19,244, ఐనవోలుకు 916, కాజీపేటకు 36,356, పరకాలకు 10,290 చీరెలను పంపిణీ చేయనున్నారు.