హనుమకొండ, సెప్టెంబర్ 25: నిట్ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమినికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నిట్ వరంగల్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుద్ధి బతుకమ్మ ఉత్సవాలను ప్రభారంభించి విద్యార్థులతో కలిసి బతుకమ్మని పూజించి ఆడారు. కార్యక్రమంలో 800 మంది విద్యార్థినులు పాల్గొని బతుకమ్మ పాటలకనుగుణంగా నృత్యాలుచేసి తోటి విద్యార్థులలో ఉత్సహాన్ని నింపారు.
డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ విద్యార్థులు ప్రపంచ నలుమూలాల నుంచి ఇక్కడ చదుకోవడానికి వచ్చారని, వారి సంస్కృతి సంప్రదాయాలు వేరు అయినా ఇక్కడి పద్ధతులని పాటించి గౌరవించడం మన సంస్కృతి అని చెప్పారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమలు రానున్నరోజుల్లో చాలా జరపాలని అఖంక్షించారు. కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ కిరణ్, ప్రొఫెసర్ పెరుగు శ్యామ్, డీన్స్, ప్రొఫెసర్స్ పాల్గొన్నారు.