హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 24: కాకతీయ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలను మహిళా బోధన, బోధనేతర సిబ్బంది ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సంపదకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరిపారు.
సీహెచ్.రాధిక కన్వీనర్‌గా, సుజాత కో-కన్వీనర్‌గా వ్యవహరించగా మహిళా సిబ్బంది అందరూ రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను సమర్పించి, పాటలు పాడుతూ, నృత్యాలతో పండుగను మరింత ఉత్సాహభరితంగా మార్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్.రమణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ నేతాజీ, సూపరింటెండెంట్ ప్రభాకర్, అధ్యాపకులు కె.సుమలత, భాగ్యలక్ష్మి, ఎం.వాణి, వెన్నల, స్వప్న, శోభారాణి, సూర్యకుమారి, గౌతమి, సంగాల రాధ పాల్గొన్నారు.