బాస్కెట్‌బాల్ గేమ్‌పై క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా యువత, అలాగే పిల్లల్లో ఆట పట్ల ఆసక్తి కనిపిస్తోంది. ప్రపంచంలో రెండో ఆటగా ప్రాచుర్యం పొందిన బాస్కెట్‌బాల్ క్రీడను వరంగల్ క్రీడాకారులు ఇష్టంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. జేఎన్ స్టేడియం వేదికగా ఉదయం, సాయంత్రం కసరత్తు చేస్తూ మినీ స్టేట్ టోర్నమెంట్‌కు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వరంగల్ నుంచి ఇద్దరు జాతీయస్థాయిలో పాల్గొనగా రాష్ట్రస్థాయిలో రెండుసార్లు బంగారు, సిల్వర్ పతకాలు సాధించడం విశేషం. అలాగే బాలికల్లో హోమా ప్రియా రాష్ట్రస్థాయిలో మూడుసార్లు పాల్గొని సత్తాచాటింది. – హనుమకొండ చౌరస్తా, మార్చి 3
బాస్కెట్‌బాల్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది. వరల్డ్‌లో రెండో క్రీడగా గుర్తింపు ఉంది. ఒక బంతిని హూప్ లేదా బాస్కెట్ ద్వారా ఉంచడం, ప్రత్యర్థి జట్టు కంటే ఎక్కువ పాయింట్లు సాధించడం దీని లక్ష్యం. జట్లు పది మంది ఆటగాళ్లను కలిగి ఉంటాయి. ఏ సమయంలోనైనా కోర్టులో గరిష్ఠంగా ఐదుగురు ఉంటారు. ఆట సమయంలో ప్రత్యామ్నాయాలు అపరిమితంగా ఉంటాయి. పాఠశాలలు, కళాశాలలు, ఇతర సమూహాల నుంచి ఒలింపిక్స్‌లో జాతీయ జట్లు ఆడతాయి. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. శారీరక పరాక్రమం, తెలివితేటలు, దయ, సమన్వయాన్ని మిళితం చేస్తుంది. 46 మిలియన్లకు పైగా అమెరికన్లు బాస్కెట్‌బాల్ ఆడుతున్నప్పటికీ, ప్రతి క్రీడాకారుడు వ్యక్తిగత శైలిని అభివృద్ధి చేసేందుకు వీలుగా ఆట సరళమైంది.
సెయింట్ పీటర్స్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నా. బాస్కెట్‌బాల్ ఆట అంటే నాకు చాలా ఇష్టం. ఇదొక ఇంట్రెస్టింగ్ గేమ్. ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్ చేస్తున్నా. గేమ్స్‌కు టైం కంపల్సరీ. ఆటలో ఉత్సాహంగా పాల్గొంటున్నా.
– ఎస్ కుందన్
ప్రపంచంలోనే సెకండ్ ఫాస్టె స్ట్ గేమ్ బాస్కెట్‌బాల్. మొత్తం మన శరీరంతో ఆడే ఆట. హనుమకొండ జేఎన్ స్టేడియంలో శిక్షణ ఇస్తున్నా. చాలామంది పిల్లలు నేర్చుకునేందుకు వస్తున్నారు. ప్రభు త్వం పే అండ్ ప్లే స్కీమ్ కింద రూ.400 శిక్షణ ఫీజు తో 30మంది ప్రాస్టీస్ చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 9వరకు మళ్లీ సాయంత్రం 4 నుంచి 7గంటల వరకు శిక్షణ నడుస్తుంది. ప్రవీణ్‌కుమార్, పవన్ అనే ఇద్దరు క్రీడాకారులు జాతీయస్థాయిలో ఆడా రు. రాష్ట్రస్థాయిలో రెండుసార్లు బంగారు, సిల్వర్ పతకాలు పొందారు. బాలికల్లో హోమా ప్రియా రాష్ట్రస్థాయిలో మూడుసార్లు పాల్గొంది. ప్రస్తుతం మినీ స్టేట్ టోర్నమెంట్లో రాణించేందుకు పిల్లలను తీర్చిదిద్దుతున్నా. ఆ దిశగా కసరత్తు చేయిస్తున్నా.
– కొత్త ప్రశాంత్, కోచ్
బాస్కెట్‌బాల్‌కు చాలా క్రేజ్ పెరిగింది. ఏడాది నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నా. పేరెంట్స్ ప్రోత్సాహం బాగుంది. మా డాడీ కూడా స్పోర్ట్స్‌మన్. ఆటలంటే చాలా ఇష్టం. అందువల్ల నేను కూడా రాణించేందుకు మెళకువలు చెబుతుంటారు. ఉదయం, సాయంత్రం శిక్షణ పొందుతున్నా. మా కోచ్ ప్రశాంత్ సార్ మంచి ట్రెయినింగ్ ఇస్తున్నారు.
– సీతా విశ్వక్, వరంగల్
ఏదైనా క్రీడ మాదిరిగానే, బాస్కెట్‌బాల్‌కు ఆట కదలికలు, నాటకాలు, స్థానాలు, మరెన్నో వివరించడానికి దాని సొంత నిబంధనలు, పదబంధాలు ఉన్నాయి. బాస్కెట్‌బాల్ ఒక జట్టు క్రీడ. ఐదుగురు ఆటగాళ్లతో కూడిన రెండు జట్లు బంతిని హూప్ ద్వారా వేయడం వల్ల 10 అడుగుల ఎత్తులో స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తాయి. కోర్టు అని పిలువబడే దీర్ఘచతురస్రాకార అంతస్తులో గేమ్ ఆడతారు. ప్రతి చివరలో ఒక హూప్ ఉంటుంది. సెంటర్ ఫ్రేమింగ్ లైన్ ద్వారా కోర్టు రెండు ప్రధాన విభాగాలుగా విభజించబడింది. ఈ గేమ్‌లో మొత్తం 4 క్వార్టర్స్ ఉంటాయి. ప్రతి క్వార్టర్‌కు 10 నిమిషాలు, 2 నిమిషాల రెస్ట్, సెకండ్ క్వార్టర్‌కు 10 నిమిషాలు, విరామం 15 నిమిషాలు, మూడో క్వార్టర్ 10 నిమిషాలు, 2 నిమిషాలు విరామం, నాలుగో క్వార్టర్ 10 నిమిషాలు, మ్యాచ్ పూర్తవుతుంది. ఈ గేమ్‌లో 12మంది ప్లేయర్స్ ఉంటారు. ఒక్క మ్యాచ్‌లో ఐదుగురు ఆడతారు. ఏడుగురు సబ్సిట్యూట్ ఉంటారు. గేమ్ ఆడాలంటే చాలా టెక్నికల్‌గా, చాలా ఎత్తుగా ఉండాలి. పాసెస్, షూటింగ్, ఒరిబ్లింగ్స్ ఇంకా చాలా వెరైటీలు ఆటలో ఉంటాయి.