శాయంపేట ఏప్రిల్ 25 : శాయంపేటలోని శ్రీ వేంకటేశ్వర శివ మార్కండేయ స్వామి శ్రీ ద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ బాసాని సూర్య ప్రకాష్, రాష్ట్ర కనీస వేతన బోర్డు సభ్యుడు బాసాని చంద్రప్రకాష్ కోరారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం బ్రహ్మోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. ఈనెల 30 నుంచి మే 3 వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు.
30న ఉత్సవాలకు అంకురార్పతొ ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. మే 1న ధ్వజారోహణం, దేవత పూజ, ఎదుర్కోలు, 2న అభిషేకం కళ్యాణం, అన్న ప్రసాద వితరణ, 3న షష్టి సుదర్శన హోమం, చండీ హోమం, పూర్ణాహుతి, ధ్వజరోహణం, ఉత్సవ పరిసమాప్తి జరుగుతుందని తెలిపారు. పెద్ద సంఖ్యలు భక్తులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బాసాని లక్ష్మీనారాయణ, వనం సదానందం, అర్చకులు రాజకుమార్ తదితరులు ఉన్నారు.