బచ్చన్నపేట అక్టోబర్ 10 : నాగిరెడ్డిపల్లె బీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. గ్రామ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కుక్కల బాలకిషన్, ఉపాధ్యక్షులుగా గొల్లపల్లి సుమన్ గౌడ్, ఎస్కే సర్దార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా ప్రధాన కార్యదర్శిగా ముచ్చనపల్లి శేఖర్, గూడెంల నరసింహులు, ప్రధాన కార్యదర్శిగా కంసాని ఎల్లారెడ్డి, కోశాధికారిగా కర్రె మహేష్ , మామిడాల నరేష్ ను ఎన్నుకున్నారు.
యూత్ కమిటీలో అధ్యక్షులుగా ఎండీ షాదుల్లా, మంజే శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా మెరుగు సాయికుమార్, మామిడాల కరుణాకర్, సోషల్ మీడియా కన్వీనర్లుగా మంగోలు ఆనంద్, బద్దిపడిగే కార్తీక్, గొల్లపల్లి సాయికుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులుగుడ్ల ఆనందం, బంగారు మల్లయ్య, తాతిరెడ్డి శశిధర్ రెడ్డి, సార్ల కిష్టయ్య, గొల్లపల్లి యాదగిరి, తాతిరెడ్డి చిన్న భాస్కర్ రెడ్డి, పాండవుల మల్లయ్య, బంగారి రవీందర్, బూడిద శ్రీనివాస్ గౌడ్, గొల్లపల్లి తిరుపతి గౌడ్, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.