నర్సంపేట, సెప్టెంబర్ 14 : రైతులెవరూ అధైర్య పడొద్దని, ధైర్యంగా నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి యూరియా తెచ్చుకోవాలని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి అన్నారు. యూరి యా దొరకక గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని బూర్కుగుంపు గ్రామానికి చెంది న రైతు మల్లెల నర్సయ్యను ఆదివారం ఆమె పరామర్శించి ధైర్యం చెప్పారు.
అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు, మంత్రి సీతక్క రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవ డం లేదన్నారు. రైతు ఆత్మహత్యలకు కాంగ్రెస్ సర్కారు అసమర్థ విధానాలే కారణమని ధ్వజమెత్తారు.
మంత్రి సీతక్క తన నియోజకవర్గ రైతులను కాపాడుకునే స్థితిలో లేరన్నారు. ఇప్పటికైనా రైతులకు యూరియా అందించి పంటలు, రైతులను కాపాడాలని కోరారు. ఆమె వెంట కొత్తగూడ, ములుగు మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు కొమ్మనబోయిన వేణు, సానికొమ్మ రమేశ్‌రెడ్డి, నాయకులు బానోత్ జవహర్, నె హ్రూ, భూపతి తిరుపతి, కాసర్ల సాంబయ్య, మాలోత్ సంతోష్‌నాయక్, ఈసం సురేశ్ ఉన్నారు.