బచ్చన్నపేట సెప్టెంబర్ 15 : అన్ని రకాల పింఛన్లను పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీని వెంటనే నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్, ఎంఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కామెడి సిద్ధారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎమ్మార్పీఎస్ బచ్చన్నపేట మండల ఇంచార్జ్ పాకాల కుమారస్వామి హాజరై మాట్లాడారు.
ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.
రెండు వేల పెన్షన్ 4 వేలు అదే విధంగా 4వేల పెన్షన్ 6కి, నరాల బలహీనత కలిగిన వారికి 15000 పెన్షన్ పెంచి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఇచ్చి 22 నెలలు గడుసస్తున్నా ఇప్పటివరకు పెంచిన దాఖలాలు లేవన్నారు. పెన్షన్స్ పెంచకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమానికి ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు నల్ల అంజయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు బంగారం చిరంజీవి, మాదిగ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు చెల్లాపురం శ్రీకాంత్ మాదిగ, బచ్చన్నపేట విహెచ్పిఎస్ నాయకుడు కనకయ్య, కంటెం, ఒగ్గు సిద్ధిరాములు, వెంకటేష్, యాదగిరి, షాబుద్దీన్, ఏనుగుల నాగరాజు మహేష్, సతీష్ మహేష్, పాకాల రమేష్ పాల్గొన్నారు.