పాలకుర్తి: పాలకుర్తి మండలం రామారావు పల్లిలో మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. బసంత్ నగర్ ఎస్ఐ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ స్వామి మాట్లాడుతూ.. యువత చెడు దారిన పట్టకుండా గ్రామస్తులు అందరూ గంజాయి ఇతర మాదకద్రవ్యాల వాడకంపై నిఘా ఉంచాలన్నారు. గ్రామంలో నూతనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరూ సీసీ కెమెరా కంట్రోల్లో ఉన్నారని చెప్పారు. ఎలాంటి సంఘవిద్రోహక, అవాంఛనీయ చర్యలు చేపట్టడానికి వీలు లేదన్నారు. అదేవిధంగా సెల్ఫోన్ మూలంగా సైబర్ నేరాలు అధికమవుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అందరూ పట్టు సాధించాలన్నారు.