హనుమకొండ, నవంబర్ 26 : ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియా గార్డెన్లో నిర్వహించిన బీసీ కులాల ఆత్మీ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. బీసీలు అంతా కలిసి మరో బీసీ బిడ్డకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. 37 కులాలు సంపూర్ణ మద్దతు ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. బీసీల నాయకత్వంలో ఎన్నో ఏళ్లుగా పనిచేసిన వ్యక్తి దాస్యం వినయ్ భాసర్ అన్నారు. బీసీలకు అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని అన్నారు. కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గంలో ఎవరికైనా ఆపద వస్తే ఆదుకునేందుకు వినయ్ భాసర్ ఉన్నాడని, సమస్యలు విని పరిషరిస్తాడని తెలిపారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, కార్పొరేటర్ రాజు, నాయకులు కోరబోయిన సాంబయ్య, జనార్దన్ పటేల్, రాజేశ్, వేణుమాధవ్, లింగమూర్తి, ప్రశాంత్, రవీందర్, రామ్మూర్తి, శ్రీనివాస్ గౌడ్, వేణుగోపాల్ గౌడ్, చిర్ర రాజు, లక్ష్మీప్రసాద్, రవి, అనిల్ పాల్గొన్నారు.
కుల సంఘాలకు ప్రాధాన్యం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని దాస్యం అన్నారు. బాలసముద్రంలోని పార్టీ కార్యాయంలో ఖత్రి మిత్రమండలి, ఎస్ఎస్కే సమాజ్ ఆధ్వర్యంలో టంకు ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తనకు ఖత్రి మిత్రమండలి మద్దతు తెలపడం ఆనందంగా ఉందన్నారు. ఖత్రి మిత్రమండలి సభ్యుల సమస్యలు నా దృష్టికి తీసుకువస్తే పరిషరించానన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. సంక్షేమ పథకాల్లో కూడా ప్రాధాన్యమిస్తానని చెప్పారు. రాబోయే రోజుల్లో కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం కోసం స్థలం, నిధులను కూడా కేటాయిస్తానని తెలిపారు. ఈ నెల 30న జరిగే ఓటింగ్‌లో ప్రతి ఒకరూ పాల్గొని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 30 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి వినయ్ భాసర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో శిరీష్, నీలం సుహాస్, ప్రశాంత్, సురేశ్, సాయినాథ్, విశ్వనాథ్, రాజు, కృష్ణ పాల్గొన్నారు.