వరంగల్, నవంబర్ 12 : అధునాతన మోడల్స్, సరికొత్త ఫీచర్స్‌తో కూడిన బ్రాండెడ్ కార్లు, బైక్‌లు వరంగల్ నగరానికి ప్రదర్శనకు రానున్నాయి. ఆటోమోబైల్ రంగంలోని ప్రముఖ కంపెనీల వాహనాలన్నీ ఒకే వేదికపై కొలువుదీరనున్నాయి. ఇప్పటి వరకు రాష్ట రాజధాని హైదరాబాద్‌కే పరిమితమైన బ్రాండెడ్ కార్లు, బైక్‌లు ఇప్పుడు వరంగల్‌లో అడుగుపెడుతున్నాయి. బీఎండబ్ల్యూ సంస్థ ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన బైక్ తొలిసారిగా ఓరుగల్లు ప్రజలను పలకరించబోతున్నది. ఇందుకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఆటో షో వేదిక కానుంది. ఇప్పటి వరకు వరంగల్ మహా నగరంలో షోరూంలు ఏర్పాటు చేయని బెంజ్, లెక్సస్ వంటి విలాసవంతమైన కార్లు సైతం ఆటో షోకు వస్తున్నాయి.
వీటితో పాటు నెక్సా, స్కోడా, కియా, ఎంజీతో పాటు మారుతి, హ్యుందయ్, టాటా, సిట్రాన్, హోండా, టయోటా, కిట్రాన్, యమహా లాంటి ప్రజాదరణ పొందిన కంపెనీలు ఆటో షోలో తమ వాహనాలను ప్రదర్శించనున్నాయి. సుమారు 20కి పైగా కార్ల కంపెనీలతో పాటు ద్విచక్ర వాహనాల కంపెనీలు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నాయి. మొదటి సారిగా బ్రాండెడ్ కార్ల కంపెనీలు ఆటో షోలో భాగస్వామ్యమవుతున్నాయి. కార్లు, మోటర్ బైక్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే వేదికపైకి వస్తుండడంతో వీటిని కొనుగోలు చేయాలనుకునే వారికి సువర్ణవకాశంగా మారనుంది. వరంగల్ నగరంలో షోరూంలు లేని బ్రాండెడ్ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆటో షోలోనే బుక్ చేసుకునే అవకాశం కలుగుతుంది.
ఇప్పటి వరకు వరంగల్‌కు రాని బీఎండబ్ల్యూ బైక్‌ను తొలిసారి ఆటో షోలో ప్రదర్శించనున్నారు. ైస్టెల్, ఫీచర్స్, పవర్‌కి పేరెన్నిక గల బైక్‌లను ఆటో షోలో అందుబాటులో ఉంచుతున్నారు. టీవీఎస్, యమహా లాంటి పాపులర్ బైక్స్‌ను ప్రదర్శించనున్నారు. ఎథర్, ఆంపేర్, హెస్తర్ ఎనర్జీ తదితర ఎలక్ట్రికల్ బైక్‌లు సైతం కొలువుదీరనున్నాయి.
వరంగల్‌లో షోరూంలు లేని బ్రాండెడ్ కార్ల కొనుగోలు కోసం ఇప్పుడు హైదరాబాద్‌కు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆసక్తి ఉన్న వారు వరంగల్‌లోనే వీటిని సొంతం చేసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సువర్ణావకాశం కల్పిస్తున్నది. 20కి పైగా కంపెనీల ఉత్పత్తులు ఒకే వేదిక పైకి రానుండడంతో వాటిలో నచ్చిన వాహనాలను కొనుగోలు చేసుకునే అవకాశం వరంగల్ ప్రజలకు ఆటో షో ద్వారా లభించనుంది. కొనుగోలుదారులకు లోన్ సౌకర్యం కల్పించేందుకు వివిధ బ్యాంక్‌లు సైతం అందుబాటులో ఉండనున్నాయి. ఎస్బీఐ, కెనరా, డీసీసీబీ, సెంట్రల్ బ్యాంక్‌తో పాటు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆటో షోలో తమ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నాయి.