ఫొటోతో హాజరు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా డీఎస్ఈ-ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైసింగ్ సిస్టమ్) యాప్ తీసుకొచ్చారు. ఇందులో స్టూడెంట్ రిజిస్ట్రేషన్, అటెండెన్స్, డిటెయిల్డ్ రిపోర్ట్, సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీం వివరాలను రోజువారీగా నమోదు చేస్తున్నారు.
- సర్కారు బడుల్లో విద్యార్థుల అటెండెన్స్ కోసం ఎఫ్ఆర్ఎస్ యాప్
శాయంపేట,డిసెంబర్ 20 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా డీఎస్ఈ-ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైసింగ్ సిస్టమ్) యాప్ తీసుకొచ్చారు. ఇందులో స్టూడెంట్ రిజిస్ట్రేషన్, అటెండెన్స్, డిటెయిల్డ్ రిపోర్ట్, సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీం వివరాలను రోజువారీగా నమోదు చేస్తున్నారు. ప్రతి విద్యార్థి ముఖాన్ని ఫొటోతీసి యాప్‌లో నమోదు చేస్తున్నారు. పాఠశాల కోడ్, పాస్‌వర్డ్‌తో యాప్‌ను ఉపాధ్యాయుల ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలి. తరగతి, సెక్షన్ల వారీగా ఒక్కొక్కరికి నంబర్ ఇచ్చి యూడైస్ ఆధారంగా యాప్‌లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.
విద్యార్థిని ఫొటో తీయడం ద్వారా ఆటోమెటిక్‌గా డీఎస్‌ఈకి కనెక్ట్ అవుతుంది. ఎమ్మార్సీ, డీఈవో ఆఫీసు ద్వారా హాజరు సమాచారం చేరుతుంది.దీంతో పక్కాగా ఎందరు విద్యార్థులు హాజరయ్యారనేది తెలుస్తుంది. మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్, రాగిజావ పక్కాగా అందాల్సిన విద్యార్థులకే అందుతుంది. సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకంలో భాగంగా వీక్లీ మెనూ అందుబాటులో ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ తినే విద్యార్థుల హాజరును ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. మరుసటి రోజు ఇండెంట్ ఏంటనేది కూడా నమోదు చేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ రిపోర్ట్‌ను రోజూ యాప్‌లో నమోదు చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

