ఏటూరునాగరం : మత్తుకు బానిసలుగా మారితే బంగారు భవిష్యత్తు నాశనమవుతుందని యువత డ్రగ్స్ మహమ్మరిని తరిమికొట్టాలని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పిలుపునిచ్చారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం డ్రగ్స్, ఫోక్సో, సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకోవడం వల్ల అనేక నస్టాలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి సారించాలని, చదువుకోవడం ద్వారా అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
డ్రగ్స్ తీసుకుంటే మానసిక సమస్యలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆందోళన, కిడ్నీ సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.
డ్రగ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ వీధి నాటకం పోస్టర్ ఆవిష్కరణ, షార్ట్ ఫిలిం, డిబేట్, క్విజ్, కవిత పోటీలు నిర్వహించి ప్రతి కనబరిచిన వారి జాబితాను ఉన్నతాధికారులకు పంపించేందుకు సిద్ధం చేశారు. అవగాహన సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ రేణుక, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్, అధ్యాపకులు వెంకటయ్య, నవీన్, జ్యోతి, ఫాతిమా, సంపత్, మున్ని, రమేష్, జీవవేణి, రాజశేఖర్,సుమలత, భావన,అభిలాష్, భాస్కర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.