హనుమకొండ చౌరస్తా, మార్చి 25: ఆర్ట్స్కాలేజీలో సంస్కృత విభాగంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న వేదాంతం హరికుమార్కు విజయవాడలోని విశ్వజ్యోతి విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో సంస్కృతరత్న ఉగాది పురస్కారం-2025 పురస్కారాన్ని ఇటీవల అందుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనను ప్రిన్సిపల్ ఆచార్య సుంకరి జ్యోతితో పాటు పాటు అధ్యాపకులు, కళాశాల సిబ్బంది హరికుమార్ను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు సాహిత్యకళా రంగాలలో మంచి ప్రావీణ్యత కలవారు ఉన్నారన్నారు. నిరంతరం పరిశోధనపై దృష్టి కేంద్రీకరించాలని, పనిచేసుకుంటూ వెళితే ఇలాంటి పురస్కారాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో పుల్లా రమేష్, శ్రీధర్ లోథ్కుమార్, కనకయ్య, శ్రీదేవి, చందులాల్, శ్రీనివాస్, ఆదిరెడ్డి పాల్గొన్నారు.