Arts College | హనుమకొండ చౌరస్తా, జూన్ 20 : హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పౌర సంబంధాల కార్యాలయం రూపొందించిన 2024 -25 ప్రెస్, మీడియా క్లిప్పింగ్స్ నివేదికను కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతాపరెడ్డి విడుదల చేశారు. ఈ మేరకు కళాశాలలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతాపరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికలలో మీడియాలో వచ్చే కథనాలను, వార్తలను డాక్యుమెంటేషన్ చేయడం ముందు తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య రామచంద్రం మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందిన మాన్యువల్ డాక్యుమెంటేషన్ తప్పనిసరి అని ఆయన అన్నారు.
ప్రిన్సిపల్ జ్యోతి మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం పౌర సంబంధాల విభాగం ఆధ్వర్యంలో రూపొందించే నివేదిక విద్యార్థులకు అధ్యాపకులకు పౌర సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఈ సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వీ హరికుమార్, పూర్వ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ ఆది రెడ్డి, కళాశాలలోని అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.