వరంగల్ : వరంగల్ జిల్లాలో లంబాడ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. లంబాడ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చలో సీఎం ఇంటి ముట్టడిని కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు లంబాడ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
కాగా, లంబాడి, ఆదివాసులు మధ్య చిచ్చు పెడుతున్న భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదిలాబాద్ కు చెందిన సోయం బాబురావు వీరిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ సభ్యత్వం రద్దు చేయాలనే పలు డిమాండ్లతో చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపు నిచ్చారు.