Nagurla Venkateswara Rao | హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 4 : తెలంగాణ రాష్ర్ట ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్ రావు ఎన్నికైనందున ఆరె ట్రస్టు సంఘం అధ్యక్షుడు సింధే రామరావు, కోశాధికారి హింగే రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో పలువురు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా వారు నాగుర్లకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం నిరంతరం పాటుపడుతూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందించారు.
రైతులకు సేవలు అందిస్తూ భవిష్యత్లో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నాగుర్ల శంకర్ రావు, రైతు సఘం రాష్ట్ర అధ్యక్షుడు మోర్తాల చందర్ రావు, హనుమకొండ మండల అధ్యక్షుడు ఆడగాని శివాజీ, సెక్రటరీ కొల్లూరి రవీందర్ రావు, కార్యవర్గ సభ్యులు మారుజోడు నరసింహరావు, కుసుంబ సాంబశివరావు, డీ అంజాజీ, ట్రస్ట్ సభ్యులు మోరే ఆగయ్య, వాడికారి రాజు, నాయకులు బాసిరి నీతాజీ, లడే గోపాల్, ఆనంద్ రావు, సురావు నర్సింగా రావు, లోనే దీపక్, మోరె రాజు తదితరులు పాల్గొన్నారు.