మరికొద్ది రోజుల్లో విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులను ఇంటి నుంచి బడికి తీసుకెళ్లి తిరిగి గమ్యస్థానానికి చేర్చాల్సిన బాధ్యత ఆయా స్కూళ్ల యాజమాన్యాలపై ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం బస్సుల నిర్వహణ సరిగా లేక ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పాఠశాలల యాజమాన్యాలు ముందుకొచ్చి తనిఖీలు చేయించుకొని వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. లేకపోతే జరినామాతో పాటు బస్సులు సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
– కరీమాబాద్, మే 28
పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ఆయా సంస్థల యాజమాన్యాలు తమ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేసుకుని జిల్లా రవాణాశాఖ అధికారుల నుంచి వాహన సామర్థ్య ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఫిట్నెస్ లేకుండా పలు బస్సులు నడిచినట్లు ఆరోపణ లు వచ్చాయి. ఈ ఏడాది రవాణా శాఖాధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే బడి బస్సులు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం ఉంది. ఉదాసీనంగా వ్యవహరిస్తే విద్యార్థుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. గతేడాది వరంగల్ జిల్లాలో 320 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకున్నాయి. ఈ ఏడాది 300 నుంచి 350 వరకు విద్యాసంస్థల బస్సులు సా మర్థ్య పరీక్షలు చేయించుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమం లో నిబంధనలను తెల్సుకోవాల్సిన అవసరం ఉంది.
నిర్ణీత సమయంలోగా పరీక్షలు చేయించుకోవాలి
జిల్లాలోని విద్యాసంస్థల బస్సులు నిర్ణీత సమయంలోగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. ఇందు కు యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలి. ఇప్పటికే విద్యాసంస్థల నిర్వాహకులకు అవగాహన కల్పించాం. ఫిట్నెస్ చేయించుకోకపోతే జరిమానాలు విధించడంతో పాటు అవసర మైతే బస్సులను సీజ్ చేస్తాం. ఇప్పటికే వాహనాలను తీసుకువస్తున్నారు. ఫిట్నెస్ పరీక్షలకు రాని వారి వివరాలను సే కరించి వారికి నోటీసులు ఇస్తాం. సమయానికి ముందే వస్తే అనుకూలంగా ఉంటుంది. ఒకేసారి అన్ని వాహనాలు వస్తే ఇబ్బందులు తలెత్తుతాయి. విద్యాసంస్థల యజమా నులు సహకరించి వాహనాలకు సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలి.
– శోభన్‌బాబు, జిల్లా రవాణా శాఖ ఇన్చార్జి అధికారి