హనుమకొండ, సెప్టెంబర్ 17: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో ఆర్చరీ పురుషులు, మహిళల జట్లను ఎంపిక చేశారు. ఇందులో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఆర్చరీ క్రీడాకారులు తన్వీర్ కౌసర్, త్రిశూల్, రమ్యశ్రీ, మనసుర హసీభ, వెంకటేష్, ఆనంద్, అశ్విత్దొర, గంగరాజు, సునీల్ పాల్గొన్నారు.
ఈ జట్లు అక్టోబర్లో పంజాబ్లోని గురుకాశి, హెచ్ఎన్ యూనివర్సిటీల్లో జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ పాల్గొంటారని స్పోర్ట్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వెంకయ్య తెలిపారు. కార్యక్రమంలో ఎ.టి.బి.టి. ప్రసాద్, కుమారస్వామి, రాజేష్, ఆంజనేయులు, పర్వీన్ క్రీడాభిమానులు పాల్గొన్నారు.