మహదేవపూర్ (కాళేశ్వరం), అక్టోబర్ 23: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అన్నారం బరాజ్‌ను బుధవారం బ్యాంక్ అధికారుల బృందం పరిశీలించింది. బరాజ్ సాంకేతిక అంశాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బరాజ్ అప్, డౌన్ స్ట్రీమ్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో పీఎన్బీ, యూబీ, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐవోబీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు మోహన్, శరత్, వివేక్, విక్రమ్ కన్నా, మనోజ్, జై ఉపాధ్యాయ, ప్రవీణ్ కుమార్ వర్మ, గాయత్రి, హర్జీత్ సింగ్, సత్యనారాయణ, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.