ములుగురూరల్, అక్టోబర్ 23 : క్రెచ్ సెంటర్ల విధి విధానాలు వెంటనే వెల్లడించాలని, అప్పటి వరకు సెంటర్ల ప్రారంభం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బుధవారం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు జిల్లా కేంద్రంలోని డీడబ్ల్యూవో కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సరోజన, సమ్మక్క మాట్లాడుతూ ధర్నా వద్దకు డీడబ్ల్యూవో వచ్చి తమను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. క్రెచ్ సెంటర్ల విధివిధానాలు రానప్పుడు సెంటర్లను ప్రారంభించడాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసినట్లు వారు తెలిపారు. కాగా, హైదరాబాద్లో గురువారం జేడీతో చర్చలున్న నేపథ్యంలో ఆందోళన విరమించాలని ములుగు సీఐ, ఎస్సై సూచించడంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు.
కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, అంగన్వాడీలు జమునారాణి, పద్మారాణి, రమాదేవి, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, సూరమ్మ, ప్రేమకుమారి, వెంకటరమణ, సరిత, నర్సమ్మ, పార్వతి, రేణుక, విజయ, పుష్ప, ఇందిరా, రాంబాబు, దీప, లక్ష్మీకాంత, రుక్మిణి, వెంకటేశ్వరీదేవి, రజిత, పార్వతి, నర్సమ్మ, రమలతోపాటు 350 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.