హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 28: కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద బీసీ సంఘం, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. కేయూ నుంచి ఎవరికీ టికెట్లు కేటాయించకపోగా ఉద్యమకారులు, విద్యార్థులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు ఉద్యమకారుడు సూదగాని మధుగౌడ్ తెలిపారు. కేయూ ఉద్యమ నాయకులకు కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తుందని భావించినా చివరికి మొండిచెయ్యి చూపించడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. బీసీలకు మొండిచెయ్యి చూపి అగ్రవర్ణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ టికెట్లు ఆశించిన నేతలతో స్వతంత్రంగా నామినేషన్లు వేయిస్తామన్నారు. ఇక్కడ శ్రీశైలం, అజిత్, రాజ్‌కుమార్, నవీన్, ప్రేమ్, రాజశేఖర్, శ్రవణ్ ఉన్నారు.