జమ్మికుంట, నవంబర్ 24: ఎన్నికలు సమీపిస్తుండడంతో జమ్మికుంట మండలంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల్లో ప్రచారంలో బీఆర్ఎస్ జోరు పెంచింది. పట్టణంలో ఇంటింటికీ వెళ్తున్న గులాబీ పార్టీ క్యాడర్, తమ ప్రభుత్వం పదేళ్లలో చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నది. పార్టీ అభ్యర్థిని పాడి కౌశిక్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిస్తున్నది. 30వ వార్డులో కౌన్సిలర్ మద్ది లావణ్య, వార్డు అధ్యక్షుడు సమ్మెట సదానందం ఆధ్వర్యంలో పాడి కౌశిక్‌రెడ్డి సోదరుడు ప్రతీక్‌రెడ్డి దంపతులు ప్రచారం చేశారు. ఫర్టిలైజర్స్ ఏరియా, కొండూరు కాంప్లెక్స్‌లను కలియతిరిగారు. ఓటు అభ్యర్థించారు. అలాగే. స్థానిక గుల్జార్ మసీద్ సమీపంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో నాయకులు ముస్లింలను కలిశారు. బీఆర్ఎస్కు మద్దతు పలుకాలని, కౌశిక్‌రెడ్డి గెలిపించుకుందామని విజ్ఞప్తి చేశారు. 13వ వార్డులో కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్, బీఆర్ఎస్వీ పట్టణాధ్యక్షుడు కొమ్ము నరేశ్ ఆధ్వర్యంలో ఆబాది జమ్మికుంట, 18వ వార్డు కొత్తపల్లిలో బొద్దుల అరుణ-రవీందర్, 20వ వార్డు కొత్తపల్లి ఏరియాలో దేశిని రాధ-సదానందం ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రచార కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పట్టణశాఖ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ పోడేటి రామస్వామి పాల్గొన్నారు.
ఇల్లందకుంట, నవంబర్ 24: మండలంలోని శ్రీరాంపల్లి, కనగర్తి, మర్రివాణిపల్లి, టేకుర్తి, మల్లన్నపల్లి, వంతడుపుల, బుజూనూర్, సీతంపేట, వాగొడ్డురామన్నపల్లి, మల్యాల, ఇల్లందకుంట తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి పాడి కౌశిక్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్లు కందాల కొమురెల్లి, ఉడుత వీరస్వామి, సర్పంచులు రాజిరెడ్డి, వనమాల, మానసామహేందర్, అరుణాసదానందం, మొగిలి, రాజు, ఎంపీటీసీ విజయకుమార్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కందాల విక్రమ్, నాయకులు రావుల ఎల్లయ్య, రాంరెడ్డి, కౌశిక్, అభిలాష్, వాసు, రాజబాబు, రమేశ్ పాల్గొన్నారు.
వీణవంక, నవంబర్ 24: మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగింది. వల్భాపూర్‌లో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, మల్లారెడ్డిపల్లిలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, వీణవంకలో పాడి కార్తీక్‌రెడ్డి, ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్‌విండో డైరెక్టర్లు కామిడి కావ్య-శ్రీనివాస్‌రెడ్డి, రాములు, సీహెచ్ శ్రీనివాస్‌రెడ్డి, సమ్మిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నాయకులు వెంకటరాజం, రాజేందర్‌రెడ్డి, అందె కుమార్, జీడి తిరుపతి, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్, నవంబర్ 24: తుమ్మనపల్లి, సిర్సపల్లి, పెద్దపాపయ్యపల్లితో పాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పాడి కౌశిక్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సర్పంచులు గూడూరి ప్రతాప్‌రెడ్డి, సువర్ణాల సునయానం, పోరెడ్డి రజిత-దయాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు రాధమ్మ, శిరీష, సింగిల్‌విండో అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, గ్రామాధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు శ్రీనివాస్, రాజు, మిడిదొడ్డి సురేశ్, గొడిశాల రాజయ్య, బొందయ్యతో పాటు తదితరులు ఉన్నారు.
హుజూరాబాద్‌టౌన్, నవంబర్ 24: ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డికి ఓటేసి గెలిపించి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన సతీమణి శాలిని శుక్రవారం పట్టణంలోని కూరగాయల మార్కెట్ ఏరియాలో ప్రజలను అభ్యర్థించారు. దీంతో అకడి ప్రజలంతా ఆమెకు మద్దతు పలుకుతూ, తప్పక ఓటేస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో కౌశిక్‌రెడ్డి చిన్నమ్మ కే భారతి, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు కల్లెపల్లి రమాదేవి, కేసిరెడ్డి లావణ్య, మారపెల్లి సుశీల, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు గొడిశాల పావని, తులసి లక్ష్మణమూర్తి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
హుజూరాబాద్‌టౌన్, నవంబర్ 24: గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే పాడి కౌశిక్‌రెడ్డిని గెలిపిస్తే హుజూరాబాద్ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 1, 2, 3, 5, 6, 7, 12, 13, 18, 21, 28వ వార్డుల్లో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. 7వ వార్డులో జరిగిన ప్రచారంలో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి కారుకు ఓటేయాలని ప్రచారం చేశారు. ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు బాషవేని వనితాకుమార్, బర్మావత్ యాదగిరి, మక్కపెల్లి కుమార్, అపరాజ ముత్యంరాజు, తొగరు సదానందం, కొండ్ర జీవితానరేశ్, ప్రతాప మంజులాకృష్ణ, గనిశెట్టి ఉమామహేశ్వర్, మంద ఉమాదేవీరమేశ్ పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని మసీద్‌ల వద్ద ముస్లింలను ఓటు అభ్యర్థించారు. ప్రచారంలో కౌన్సిలర్లు, ఆయా వార్డుల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.