హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 21: వరంగల్ నిట్లో ఆలిండియా ఇం టర్ టోర్నమెంట్స్ శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ టోర్నమెంట్స్ శుక్రవారం సాయంత్రం నిట్ స్టేడియం లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వా లీబాల్, హ్యాండ్ బాల్, యోగా పోటీలు 21 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు.
ఈ వేడుకను అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు జీఆర్ కిర ణ్ ప్రారంభించారు. స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ డీ శ్రీనివాసాచా ర్య, స్పోర్ట్స్ కార్యకలాపాల హెడ్ ప్రొఫెసర్ రవికుమార్ హాజరయ్యారు. గౌరవఅతిథులుగా ప్రొఫెసర్ అజీమ్ (చీఫ్ వార్డెన్), ప్రొఫెసర్ ఆర్ దయానిధి (భౌతిక విద్యావిభాగం మాజీ అధిపతి, పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్), అలాగే ప్రొఫెసర్ ఆండ్రూ (భౌతిక విద్యా విభాగం నుంచి పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్) పాల్గొన్నారు.
ప్రారంభ కార్యక్రమంలో జీఆర్ కిరణ్ మాట్లాడుతూ.. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు విజయం కోసం మాత్రమే కాకుండా క్రీడా స్ఫూర్తిని ఆస్వాదించాలన్నారు. క్రీడలు క్రమశిక్షణ, టీమ్ వర్, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలోఉపయోగపడుతాయన్నారు. దేశంలోని ఎన్ఐటీల నుంచి మొత్తం 775మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. వాలీబాల్, హ్యాండ్బాల్ పోటీలు తెలంగాణ వాలీబాల్, హ్యాండ్బాల్ అసోసియేషన్ల పర్యవేక్షణలో, యోగా పోటీలు తెలంగాణ యోగా అసోసియేషన్ పర్యవేక్షణలో జరుగనున్నాయి.