కాశీబుగ్గ, సెప్టెంబర్11: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఐసీఏఆర్లో రెండు ర్యాంకులు సాధించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ నిర్వహించిన జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పరీక్షల్లో వెల్ది హర్షిత వాటర్ సైన్స్ టెక్నాలజీ విభాగంలో రెండో ర్యాంకు సాధించింది.
అలాగే వ్యవసాయ విస్తరణ విభాగంలో పూర్వపు విద్యార్థి బండేవాలి శ్వేత సీనియర్ రిసెర్చ్ ఫెల్లోషిప్ పరీక్షల్లో జాతీయస్థాయిలో 6వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీలో మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. విద్యార్థులు సాధించిన విజయాలతో తమ కళాశాల పేరు ప్రఖ్యాతులు మరింత పెరుగుతాయని అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం బలరాం హర్షం వ్యక్తం చేశారు.