మహబూబాబాద్/మహబూబాబాద్ రూరల్, జనవరి 3 : జిల్లా కలెక్టర్ శశాంక రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అద్వైత్‌కుమార్ సింగ్‌ను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులిచ్చారు. ఇక్కడ రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించిన శశాంక జిల్లా ప్రగతిపై తనదైన ముద్ర వేశారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించారు. అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను త్వరగా పూర్తి చేశారు. ప్రధానంగా గత నెలలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలను ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా నిర్వహించారు.