నయీంనగర్, జూలై 15 : బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసే పలువురు పార్టీలో చేరుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని ఆయన నివాస ఆవరణలో శనివారం గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ వంగపహాడ్ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 150 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరగా, వారికి ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ప్రజా సంక్షేమమే ఎజెండాగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పన, మార్కెట్ డైరెక్టర్ గణిపాక విజయ్, డివిజన్ అధ్యక్షుడు జంగా కుమార్, గ్రామ అధ్యక్షుడు చింతం శ్రీనివాస్, మనబడి మన బాధ్యత కన్వీనర్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ మెరుగు రాజేశ్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, నరేండ్ల శ్రీధర్, శ్యామ్ పాల్గొన్నారు. కాగా, గ్రేటర్ ఒకటో డివిజన్ పలివేల్పులకు చెందిన గుడిసెవాసులు ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వం బీఆర్ఎస్దే అన్నారు.
అర్హులైన వారందరికీ జీవో 58 ప్రకారం ఉచితంగా ఇళ్ల పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపుగా అన్ని కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు, ఇంటి నెంబర్లు ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా పూర్తి కాని సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్, మార్కెట్ డైరెక్టర్ విజయ్, తహసీల్దార్ రాజ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
పేద ప్రజల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా
హసన్‌పర్తి : పేద ప్రజల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా ఇస్తున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్‌పర్తి మండల పరిధిలోని వంగపహాడ్, ముచ్చర్ల, కోమటిపల్లికి చెందిన భార్గవి, సతీశ్, సుశీలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.1.50లక్షల విలువగల చెక్కులను శనివారం వారికి ఎమ్మెల్యే రమేశ్ అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్, ఒకటో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్, 56వ డివిజన్ అధ్యక్షుడు మణీంద్రనాథ్, పీఏసీఎస్ చైర్మన్ మెరుగు రాజేశ్‌గౌడ్, మార్కెట్ డైరెక్టర్ గనిపాక విజయ్, జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, కుడా మాజీ డైరెక్టర్ రమేశ్ యాదవ్, బొమ్మగాని వెంకటేశ్, యూత్ అధ్యక్షుడు సాయి పాల్గొన్నారు.