హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 22: ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని తదనుగుణంగా పట్టుదల, లక్ష్యనిర్దేశనంతో కష్టపడి చదివితే ఉన్నత ఉద్యోగాలను సాధించవచ్చని, ప్రతి విద్యార్థిని ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా తమ చదువును కొనసాగించాలని వరంగల్ అడిషనల్ డీసీపీ ఎన్.రవి అన్నారు. పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో ‘రీసెంట్ ట్రెండ్స్అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ కెమికల్ అండ్ అలైడ్ సైన్సెస్ రీసెర్చ్’ అనే అంశంపై రసాయన శాస్త్ర విభాగం నిర్వహిస్తున్న రెండురోజుల జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
రసాయన శాస్త్రం మానవ నిత్యజీవితంలో విడదీయరాని భాగంగా ఉందన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సీనియర్ ప్రొఫెసర్ లలిత గురుప్రసాద్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి కేయూ ప్రొఫెసర్లు జి.హనుమంతు, ఎన్.వాసుదేవరెడ్డి, ప్రొఫెసర్ సిహెచ్ సంజీవరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, సదస్సు కో కన్వీనర్ డాక్టర్ ఎం.ప్రశాంతి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ సురేష్‌బాబు, ఉదయశ్రీ, బాలరాజు, జ్యోతి, అధ్యాపకులు సారంగపాణి, అరుణ, బి.యుగంధర్, శ్రీలత, జ్యోతిర్మయి మహిత, మమత, రాజేశ్వరి, శీనివాస్, బాలరాజు, సారంగపాణి, రాజు, ఉదయశ్రీ, ప్రశాంతి, రాంరెడ్డి, మహేష్, కవిత, సుమలత, యుగంధర్, భోధన, బోధనేతర సిబ్బంది, ఇతర కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.