హనుమకొండ చౌరస్తా, జులై 19: మన్నికైన నాణ్యతగల ఆభరణాల సంస్థ గోయాజ్ సిల్వర్ జువెలరీ హనుమకొండ నయీంనగర్‌లోని ప్రెసిడెంట్ దాబా బిల్డింగ్‌లో 13వ స్టోర్ ప్రారంభమైంది. దీనిని సినీనటి నిధి అగర్వాల్ లాంఛనంగా ప్రారంభించారు. హీరోయిన్ను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యువెలరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ షోరూంలో మంచి సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్లు ఉన్నాయని సినీనటి నిధి అగర్వాల్ అన్నారు. వరంగల్ నాకు చాలా బాగా నచ్చింది.
పవన్‌కళ్యాణ్‌తో నటిచడం నా అదృష్టమని, హరిహర వీరమల్లు 24న రిలీజ్ కాబోతుందని తెలిపారు. గోయాజ్ స్టోర్ ప్రారంభం సందర్భంగా జులై 19 నుంచి ఆగస్టు 3 వరకు అద్భుతమైన ఆఫర్లను గొప్ప ప్రారంభ ఆఫర్లతో అందిస్తున్నట్లు నిర్వాహకులు రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి తెలిపారు. పలు కొనుగోళ్లపై నెక్లెస్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన ఏకైక సిల్వర్ జ్యువెలరీ స్టోర్ గోయాజ్ వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయన్నారు.