వరంగల్ : విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలం ఎంపీడీవో కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలపై, పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులపై గ్రామాలవారీగా చల్లా సమీక్షించారు. నిర్ధేశిత సమయంలో పనులు పూర్తి చేయాలన్నారు. ఎవరైనా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.