పరకాల : ప్రజల భద్రత, సంరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఏసీపీ సతీష్ బాబు అన్నారు. శనివారం స్థానిక పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా పరకాల పట్టణంలో పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం ఘటన ద్వారా దేశ ప్రజల్లో అలజడి రేగినప్పటికి ఆపరేషన్ సిందూర్ ద్వారా విజయం సాధించి ఆత్మవిశ్వాసం చాటించనట్లు చెప్పారు. అదే క్రమంలో దేశం, రాష్ట్రంతో పాటు వరంగల్ కమిషనరేట్ పరిధిలో సైతం ఎలాంటి క్రౌడ్ కంట్రోల్ పరిస్థితులు ఏర్పడినా ఎదుర్కోడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
తాము ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు ఎవరైనా అపరిచతులను గమనించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఎఫ్ అధికారి సరస్వతి, పరకాల, శాయంపేట, ఆత్మకూరు సీఐలు క్రాంతి కుమార్, రంజిత్ రావు, సంతోష్, ఎస్సైలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.