కన్నాయిగూడెం, ఆగస్టు 24 : విధి నిర్వహణ కోసం వరదను సైతం లెక్కచేయలేదామె. రెండు వాగులు దాటి సుమారు మూడు కిలోమీటర్లు నడిచి సబ్సెంటర్కు చేరుకుంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సర్వాయి సబ్సెంటర్లో ఎనిమిది మంది ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు.
ప్రతిరోజు ఒకరు తప్పకుండా అక్కడ డ్యూటీలో ఉండాలి. శనివారం జ్యోతిరాణి అనే ఆశ కార్యకర్త సిం గారం నుంచి బస్సులో వెళ్లి కొత్తూ రు స్టేజ్లో దిగి రెండు వాగులను దాటి సర్వాయి చేరుకుంది. శనివారం తెల్లవారుజామున వర్షం కురవడంతో వాగులో వరద ఎక్కువ ఉన్నప్పటికీ డ్యూటీ చేయాలనే పట్టుదలతో ముందుకువెళ్లడాన్ని పలువురు అభినందించారు.