హనుమకొండ, నవంబర్ 10: జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష విభాగంలో ప్రత్యేక అవసరాలగల విద్యార్థులకు నిర్వహించే భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలగల విద్యార్థులకు అందించే ఫిజియోథెరపి సేవ చేయడానికి అర్హత కలిగిన ఫిజియోథెరఫిస్టుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏ.వెంకటరెడ్డి తెలిపారు.
హనుమకొండ జిల్లాలోని పరకాల, శాయంపేట, ఆత్మకూరు, దామెర, వేలేరు, కమలాపూర్, భీమాదేవరపల్లి, నడికుడ, మండలాలలో నడుస్తున్న భవిత కేంద్రాలలో పూర్తి తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు బ్యాచిలర్ అఫ్ ఫిజియోథెరపీ లేదా మాస్టర్ అఫ్ ఫిజియోథెరపీ చదివినవారు ఈనెల 13 వరకు జిల్లా విద్యాశాఖలోని సమగ్రశిక్ష విభాగంలో దరఖాస్తులను అందచేయాలని, అదనపు సమాచారం కోసం సమ్మిళిత విద్య సమన్వయకర్త బద్దం సుదర్శన్‌రెడ్డి 96036 72289ని సంప్రదించాలని కోరారు.