తాడ్వాయి/మంగపేట, డిసెంబర్ 12 : తాడ్వాయి మండలంలోని పంబాపురం అడవుల్లో గురువారం పులి సంచరించింది. గ్రా మ సమీప అడవిలో పులి పాదముద్రలు గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో వైల్డ్‌లైఫ్ ఎఫ్ఆర్వో సత్తయ్య తన సిబ్బంది కలిసి పంబాపురం సమీప ప్రాంతంలోని వాగులో పాదమ్రుదలను గుర్తించి పులి సంచరించినట్లు నిర్ధారించారు. బుధవారం రాత్రి మంగపేట అడవుల నుంచి తాడ్వాయి అడవుల్లోకి వచ్చినట్లు తెలిపారు. సమీప గ్రామ ప్రజలు, పశువుల కాపర్లు అడవిలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కాగా మంగపేట మండలంలోని చుంచుపల్లి శివారు గోదావరి తీరం, తిమ్మాపురం సమీప చౌడు ఒర్రె ప్రదేశంలో గుర్తించిన పులి పాదముద్రలను గురువారం డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్ పరిశీలించారు. కొలతల ఆధారంగా వచ్చింది పులేనని నిర్ధారణకు వచ్చారు.
గుమ్మడిదొడ్డిలో తోడేలును పోలిన జంతువు ఆనవాళ్లు..
వాజేడు : వాజేడు మండలం గుమ్మడిదొడ్డి శివారు పొలాల్లో గుర్తుతెలియని అడవి జంతువు పాదముద్రలను అటవీ అధికారులు పరిశీలించారు. గ్రామస్తులు చిరుత పులి పాదముద్రగా భావించిన నేపథ్యంలో ఆ ప్రదేశా న్ని గురువారం దూలపురం అటవీశాఖ ఇన్చార్జి రేంజ్ అధికారి బాలకృష్ణ ఆధ్వర్యంలో సందర్శించారు. పాదముద్రల కొలతలు తీసి వాటి ఆధారంగా తోడేలు లేదా నక్కజాతికి చెందిన జంతువుగా భావిస్తున్నట్లు తెలిపారు. నిర్ధారణ కోసం పాదముద్రల ఆనవాళ్లను హై దరాబాద్‌లోని జూకు పంపించినట్లు డీఆర్వో పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సూచించారు. ఆయన వెంట సెక్షన్ ఆఫీసర్లు శివాజీరెడ్డి, చిన్నక్క, ఎఫ్‌బీవోలు వాసుబాబు, శృతిలయ ఉన్నారు.