తాడ్వాయి : వ్యాపారం నిర్వహించేందుకు చేసిన అప్పులు తీర్చలేక పిల్లి సత్యం (50) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన సత్యం గాజుల దుకాణం నిర్వహించేందుకు గ్రామంలో కొందరు వద్ద రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. వ్యాపారం సరిగా నడవకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలని మదన పడుతుండేవాడని, సోమవారం ఉదయం మనస్థాపానికి గురై షాపు వెనకాల గల రేకుల షెడ్డులో తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య జ్యోతి తెలిపారు.