కేసముద్రం, జనవరి 16: పండుగ కు ఇంటికి వచ్చి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తల్లి, కూతురు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా రాయగిరి వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం మండలం గాంధీపురం శివారు వెంకటాపురం తండాకు చెందిన భూ క్యా సంతోష్-అనూష దంపతులు కొన్నేళ్లుగా హైదరాబాద్లోని ఓ ప్రైవే ట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ప్రాణస్విని, చైత్ర ఉన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూడు రోజుల క్రితం సంతోష్ కుటుంబంతో సహా హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వచ్చా డు.
పండుగ అనంతరం గురువారం తెల్లవారుజామున చెల్లె భవాని, బావ రవి, భార్య, పిల్లలతో కలి సి కారులో తిరిగి హైదరాబాద్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో రాయగిరి వద్ద కారును లారీని ఢీకొట్టడంతో ముందు కూర్చు న్న అనూష(34), చైత్ర(6)లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సంతోష్, భవాని, రవి, ప్రాణస్వినిలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తండాలో పండుగ పూట విషాదం నెలకొంది.