మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 30 : పదో తరగతి ఫలితా ల్లో మానుకోట మెరిసింది. బుధ వారం విడుదలైన ఫలితాల్లో 99.29 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రం లోనే మొదటిస్థానంలో నిలిచిం ది. అన్ని పాఠశాలల్లో 8,184 మంది విద్యార్థులకు 8126 మంది ఉత్తీర్ణులు కాగా బాలుర కంటే బాలికల ఉత్తీర్ణతా శాతం అధికంగా ఉంది. జిల్లాలో 15 కేజీబీవీలకు 14 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించ డం విశేషం.
కాగా సమష్టి కృషి వల్లే రాష్ట్రంలో మొదటి స్థానం దక్కిందని మహబూబాబాద్ డీఈవో రవీందర్రెడ్డి తెలిపారు. ఇక 98.81 శాతంతో జనగామ రాష్ట్రంలో 3వ స్థానం, ములుగు 97.64 శాతంతో 8, 96.13 శా తం ఉత్తీర్ణతో హనుమకొండ 18, జయశంకర్ భూపాలపల్లి 22, వరంగల్ జిల్లా 93.09 శాతంతో 23వ స్థానంతో సరిపెట్టుకుంది.