కే-హబ్‌లో 5 పరిశోధన కేంద్రాలు
హనుమకొండ చౌరస్తా, జనవ రి 25: పరిశోధన రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం నూతన ఒరవడికి నాంది పలికింది. కేంద్ర మానవ వనరుల విభాగం, రాష్ట్ర ప్రభుత్వం 60:40 వాటాతో ‘రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రుసా)’ 2019- 2020 సంవత్సరానికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగా రూ.15 కోట్లతో ‘ఇంక్యుబేటర్ సెంటర్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్’ కింద కే-హబ్ భవనాన్ని నిర్మించారు.
2024లో రూ.35 కోట్లు మంజూ రు కాగా పూర్తికాల వీసీ లేకపోవడంతో తదుపరి కార్యాచరణ జరగలేదని ఆచార్య కే ప్రతాప్‌రెడ్డి వైస్‌ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పె ట్టారు. ఇందులో భాగంగా రుసా మంజూరు చేసిన ఐదు పరిశోధన కేంద్రాలను ఏర్పాటుచేస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పెరటి మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
వీటిలో సెంటర్ ఫర్ డ్రగ్ రీసెర్చ్, సెంటర్ ఫర్ మాలిక్యులర్ మెటీరియల్ ఫిజిక్స్, నానో డ్రగ్ డెలివరీ సిస్టమ్(నానో సైన్సెస్), సెంటర్ ఫర్ ఇథ్నో-మెడిసినల్ ప్లాంట్స్, సెంట ర్ ఆన్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ఉ న్నాయని మల్లారెడ్డి తెలిపారు.