‘సే నో టు డ్రగ్స్’ పేరిట వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆధ్వర్యంలో ఆదివారం 4కే రన్ నిర్వహించారు. కమిషనరేట్ పరేడ్ మైదానం నుంచి అదాలత్ వరకు నిర్వహించిన కార్యక్రమం లో హనుమకొండ,
వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి పాల్గొని పరుగెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
– సుబేదారి, ఆగస్టు 18